Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

Follow Ushodayam on Google
Muthyam silari Sep 09, 2026 3:34 PM నిర్మల్General
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ - Ushodayam
దిలావర్‌పూర్ మండల ఆశా వర్కర్లు బుధవారం చాకలి ఐలమ్మ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తూ, తమ గోడును చెప్పుకునే అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...