Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్నబ్ తుఫాన్‌పై గ్రామాల్లో దండోరా

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:02 AM పార్వతీపురం మన్యంGeneral
ఆర్నబ్ తుఫాన్‌పై గ్రామాల్లో దండోరా - Ushodayam
ఆర్నబ్ తుఫాన్‌ నేపథ్యంలో కొమరాడ మండలం కొట్టు గ్రామంలో రెవెన్యూ, పోలీసు అధికారులు దండోరా వేయిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నదులు, వాగులు, కాలువల్లో నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉన్నందున అటువైపు వెళ్లవద్దని హెచ్చరించారు. పశువులను మేపేందుకు నదీ తీరాలకు తీసుకెళ్లవద్దని సూచించారు. పిల్లలు, మహిళలను నీటి ప్రవాహం వద్దకు వెళ్లనీయవద్దని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...