Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

614 కిలోమీటర్ల పర్యావరణ పాదయాత్ర

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 7:07 AM నిజామాబాద్General
614 కిలోమీటర్ల పర్యావరణ పాదయాత్ర - Ushodayam
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు భక్తులు చేపట్టిన 614 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసింది. సెప్టెంబరు 27న నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం దోస్త్‌పల్లి నుంచి మహారాష్ట్రలోని నానీజ్‌ధామ్‌కు వసుంధర పాదయాత్రగా బయలుదేరారు. మార్గమధ్యలో ప్లాస్టిక్ నియంత్రణ, పరిశుభ్రత, భూగర్భ జలాల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. శనివారం తెలంగాణ ఉప పీఠానికి తిరిగొచ్చిన భక్తులకు స్థానికులు ఘనస్వాగతం పలికారు.

Comments

G
Loading comments...