Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15 వేల మందితో బతుకమ్మ సంబరాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 8:59 PM జాతీయంGeneral
15 వేల మందితో బతుకమ్మ సంబరాలు - Ushodayam
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలోని కొమెరికా సెంటర్‌లో టి-ప్యాడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో 15 వేల మంది పాల్గొనగా, వెయ్యి మందికి పైగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిషాసుర మర్దిని నృత్యరూపం ఆకట్టుకుంది. అనంతరం సంప్రదాయబద్ధంగా బతుకమ్మల నిమజ్జనం నిర్వహించారు.

Comments

G
Loading comments...