Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరిలో కాండం తొలిచే పురుగు పట్ల అప్రమత్తంగా ఉండాలి

Follow Ushodayam on Google
Udayam News Sep 24, 2026 5:08 PM జగిత్యాలతెలంగాణ
వరిలో కాండం తొలిచే పురుగు పట్ల అప్రమత్తంగా ఉండాలి - Ushodayam
వరి పంటలో కాండం తొలిచే పురుగు ఉధృతి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డా. టీ. ఎల్లగౌడ్, వై. స్వాతి సూచించారు. గురువారం మండలంలోని పలు ప్రాంతాల్లో పంటలను పరిశీలించారు. ఆకులు ఎండిపోవడం, మధ్య కాడ వాడిపోవడం వంటి లక్షణాలను గమనించాలని, పురుగు ఆనవాళ్లు కనిపిస్తే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అధికారులు సూచించకుండా మందులు పిచికారీ చేయవద్దన్నారు.

Comments

G
Loading comments...