Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళహారతులతో గణనాథుడికి ఘన వీడ్కోలు

Follow Ushodayam on Google
Udayam News Sep 23, 2026 8:12 PM జగిత్యాలతెలంగాణ
మంగళహారతులతో గణనాథుడికి ఘన వీడ్కోలు - Ushodayam
మెట్‌పల్లి మండలం రాజేశ్వర్ రావ్ పేటలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. నిమజ్జనం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. అనంతరం అలంకరించిన వాహనంపై విగ్రహాన్ని గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్రగా తరలించారు. యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నామస్మరణలు చేశారు.

Comments

G
Loading comments...